ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్న కే‌సి‌ఆర్ – ఇంత కోపం తెప్పించింది ఎవరు !

-

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తరపున ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ లతో మరియు మేయర్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ని బలంగా నమ్మరని మరోసారి రుజువు చేశారని తెలిపారు. కాబట్టి పని విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా మీ పదవులు ఊడిపోతాయి అని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కెసిఆర్ వార్నింగ్ ఇచ్చారు.

ముఖ్యంగా మరుగుదొడ్లు మరియు మురికి కాలవలో శుభ్రపరిచే విషయములో నగరపాలక సంస్థలు సరిగ్గా పని చేయాలని చాలా కోపంగా ఈ సమావేశంలో కెసిఆర్ చెప్పారట. నగర పాలక సంస్థలు సరిగ్గా పని చేస్తున్నాయా..? లేదా..? చూడాల్సిన‌వి మీరే అంటూ మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్లు, మేయ‌ర్ల‌ కి గట్టిగా కేసీఆర్ క్లాస్ తీసుకున్నారట. ఇదే తరుణంలో విద్యుత్ ఉద్యోగులు అక్కడ ఉండటంతో చాలా కోపంగా వారిమీద కెసిఆర్ సీరియస్ అయినట్లు సమాచారం.

 

ఎనిమిది నెలల్లో విద్యుత్ సమస్యలను చక్కదిద్దాలని దానికి కావలసిన వనరులను ఎమ్మెల్యేలు మరియు మేయర్లు, ఛైర్ ప‌ర్స‌న్లు, క‌మిష‌న‌ర్లు చూసుకుంటారని హెచ్చరించారట. అంతేకాకుండా త్వరలో ఈ నెల 24 నుండి పది రోజులపాటు జరగబోయే పట్టణ ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కెసిఆర్ కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మేయర్ లకి సూచించారట. దీంతో కొత్తగా ఎన్నికైన తెలంగాణ మున్సిపల్ చైర్ పర్సన్ లకు కమిషనర్లకు కెసిఆర్ సీరియస్ గా క్లాస్ తీసుకోవటంతో ఈ సమావేశం తెలంగాణ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది 

Read more RELATED
Recommended to you

Exit mobile version