ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

-

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త అందింసిహ్న్ది. 200 కోట్ల ఆర్టీసీ కార్మికుల సిసిఎస్ బకాయిలను ఆర్టీసీ ఈరోజు జమ చేసింది. గత ఏడాది ఆర్టీసీ సమ్మె కాలానికి సంబంధించిన 12 రోజుల వేతనంని కూడా రేపు ఉద్యోగుల అకౌంట్లలో యాజమాన్యం వేయనున్నట్టు చెబుతున్నారు. కరోనా సమయంలో కోత విధించిన జీతాన్ని కూడా వచ్చే సోమవారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో ఆర్టీసీ జమ చేయనున్నట్లు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో వెనక బడిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభై శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొన్న ఆదివారం నిర్ణయించారు. తక్షణమే 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆరోజునే ఆయన ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version