తెలంగాణలో కరోనా విశ్వరూపం దాల్చుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ పెట్టినా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి బయట తిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంజీఎం ఆస్పత్రి సందర్శనలో భాగంగా కేసీఆర్ కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో శనివారం పోలీసులు తమ పనితనం చూపించారు. బయటకు వచ్చిన వారికి చుక్కలు చూపించారు. ఎవరు కనపడితే వారిని ఆపి బండి సీజ్ చేశారు.
అయితే కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హెల్త్ స్టాఫ్, ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను ఆపారు. దీంతో సోషల్ మీడియాలో పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం అయింది. మరి కేసీఆర్ నోట లాక్‌డౌన్ అన్న మాట వచ్చిందంటే మామూలుగా ఉంటుందా. ఎంతైనా కేసీఆర్ ఏది చెప్పినా అదొక సంచలనమే కదా.