మత్స్యకారులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..కొత్తగా లక్ష మంది సభ్యత్వం

-

మత్స్యకారులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త. చేపలు పట్టేందుకు మత్స్యకార కులస్తులకే హక్కు కల్పిస్తున్నామని, చెరువుల్లో చేపలు పట్టడానికి ఇతరులకు హక్కు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ‘చేపల ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాయితీపై చేప పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

టీఎస్ లో 3.65 లక్షల మందికి మత్స్యకారులుగా సభ్యత్వం ఉంది. కొత్తగా లక్షమంది మత్స్యకారులకు సభ్యత్వం ఇవ్వబోతున్నాం’ అని అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, తాము ఆదనంగా 35 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు రేషన్ కార్డులు అందుతాయని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version