తెలంగాణలో మరో చరిత్రకు శ్రీకారం : కేసిఆర్

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రైతు వేదిక నిర్మాణం విషయంలో కూడా ఎంతో ఖచ్చితత్వంతో ముందుకు సాగుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఏకంగా రైతు వేదికలను పూర్తి చేసి ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక ఇటీవలే జనగామ జిల్లా కొడకండ్ల లో రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్… తమది రైతు ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇప్పటివరకు రైతులకు రైతు వేదికలు లేవు అంటూ తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులందరికీ రైతు వేదికలు ఏర్పాటు చేసి ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది అంటూ వ్యాఖ్యానించారు. ఏ దేశంలో కూడా ఇప్పటివరకు రైతు వేదికలు ఏర్పాటు చేయలేదని తెలంగాణ రాష్ట్రం మాత్రం రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు వేదికలు ఏర్పాటు చేసింది అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2400 క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version