కేసీఆర్ వర్సెస్ కమలం: సవాళ్ళ పర్వం..వర్కౌట్ అవ్వవా?

-

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్‌లో నడుస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉన్నాయి. అసలు ప్రతిరోజూ భోజనం చేస్తున్నారో లేదో తెలియదు గానీ…ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు మాత్రం చేసుకుంటున్నారు. పైగా రోజుకో సవాల్‌తో రెండు పార్టీలు రాజకీయ యుద్ధం చేస్తున్నాయి.

అసలు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బీజేపీ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ముందుకెళుతున్నారు. తనకు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎక్కడకక్కడ టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టడానికే చూస్తున్నారు. మిగిలిన బీజేపీ నేతలు సైతం ఎటాక్ మోడ్‌లో ఉన్నారు. పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు.

ఇదే క్రమంలో కేసీఆర్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉంది…త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమని, థర్డ్ ప్రంట్ పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, జైలు వెళ్లొచ్చని విషయం కేసీఆర్‌కు తెలిసిపోయింది కాబట్టే విపక్ష పార్టీల నేత‌లతో వరుసగా భేటీ అవుతున్నారని అన్నారు. సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రంట్ లేదు.. టెంట్ లేదని, కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా జైలుకు పంపించుడు పక్కా అంటూ బండి వార్నింగ్ ఇచ్చారు.

అదే సమయంలో కేసీఆర్ సైతం…బీజేపీపై సీరియస్ కామెంట్స్ చేశారు. రైతులని మోసం చేస్తున్న బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని అన్నారు. ఇలా రెండు పార్టీల మధ్య వార్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. వీరి మధ్య సవాళ్ళు నిజంగానే వర్కౌట్ అవుతాయా..లేక రాజకీయంగా ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఇలా విమర్శలు చేసుకుంటున్నారా అనే డౌట్ ఉంది. కేసీఆర్‌ని జైలుకు పంపుతామని అంటారు గానీ..ఇంతవరకు ఆయనపై చర్యలు తీసుకోలేదు…ఇటు బీజేపీని సైతం కేసీఆర్ ఏం చేయలేకపోతున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే రాజకీయ డ్రామాగానే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version