కేసీఆర్ వర్సెస్ బీజేపీ…ఆగని లొల్లి..మధ్యలో గజరాజు ఎంట్రీ!

-

తెలంగాణలో కేసీఆర్…బీజేపీల మధ్య వార్ ఆగడం లేదు. ఓ వైపు బీజేపీ నేతలు…కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ, విజయశాంతి, రాజాసింగ్, రఘునందన్ లాంటి నాయకులు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఏదొక అంశంపై ఫోకస్ చేసి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

అయితే మొదట్లో టీఆర్ఎస్ నేతలు…బీజేపీకి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీకి చెక్ పెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. అటు బీజేపీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్లు ఇచ్చేస్తుంది.

తాజాగా కూడా కేసీఆర్ తనదైన శైలిలో బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలను గ్రామాల్లోకి రానివ్వొద్దని, వచ్చినవారిని ఉరికించాలంటూ సీఎం కేసీఆర్‌ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ వెంటనే బండి సంజయ్..కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చేశారు. కేసీఆర్‌ బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారని, ఎవరిని ఉరికిస్తరు?.. ఎందుకు ఉరికిస్తరు? అని ప్రశ్నించారు. ఇక్కడ మీరు అధికారంలో ఉంటే, కేంద్రంలో ఉన్నది తామే అని, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలది.. తెలంగాణ ప్రజలది.. ఆ సంగతి గుర్తుంచుకోండని వార్నింగ్ ఇచ్చారు.

ఇక మధ్యలో కేసీఆర్‌ని శ్రీరంగంలో గజరాజు ఆశీర్వదించిన టాపిక్ కూడా తీసుకొచ్చారు. కేసీఆర్‌వి ఊసరవెల్లి బుద్ధులని, చివరకు గజరాజు కూడా గుర్తించిందని, అందుకే శ్రీరంగంలో ఆయనకు మొట్టికాయలు వేసినా బుద్ధి రాలేదని అన్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ మాట్లాడితే..తాము వంద మాట్లాడతామన్నట్లు బీజేపీ ఉంది. అసలు ఏ మాత్రం కూడా బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. ఎక్కడకక్కడ కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version