మంత్రులకు కెసిఆర్ వార్నింగ్… అందుబాటులో ఉండండి…!

-

తెలంగాణాలో రాజకీయ పరిణామాలు మారతాయి అనే వార్తలు ఏమో గాని… ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు మాత్రం అన్నీ ఇన్ని కావు… తెలంగాణాలో బలంగా ఉన్న తెరాస పార్టీని బిజెపి ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది అనే విషయం కొన్ని రోజులుగా స్పష్టంగా అర్ధమవుతు వస్తుంది.. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వంలో ఉన్న లోపాలను టార్గెట్ చెయ్యాలని బిజెపి భావించడం ఇప్పుడు కెసిఆర్ కి చికాకుగా మారింది. ఆయన లక్ష్యంగా బిజెపి అధిష్టానం పావులు కదుపుతుంది.

ఈ నేపధ్యంలోనే మంత్రులు, వారి శాఖల్లో ఉన్న లోపాల మీద కూడా బిజెపి దృష్టి సారించింది. ఈ తరుణంలో కెసిఆర్ తన కేబినేట్ మంత్రులకు కీలక హెచ్చరికలు జారీ చేసారు. కొన్ని రోజులుగా తెలంగాణాలో మంత్రుల మీద అనేక విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వారు అధికారులకు అందుబాటులో ఉండటం లేదని, అసలు హైదరాబాద్ రావడానికి కూడా చాలా మంది మంత్రులు ఇష్టపడటం లేదనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

వారంలో మూడు రోజులు మంత్రులు హైదరాబాద్ లో ఉండాలని తర్వాతే జిల్లాలకు వెళ్లాలని కెసిఆర్ చెప్పారట. అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని, ఇందులో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం ఉద్వాసన తప్పదు అని హెచ్చరించారట. బిజెపి దృష్టి పెడుతుంది కాబట్టి సున్నిత అంశాలు అనేవి బయటకు వచ్చే ప్రమాదం ఉందని, మంత్రులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ ముందుకి వెళ్లాలని, సచివాలయంకి కూడా వెళ్లాలని మంత్రులకు కెసిఆర్ సూచించారట… ఇక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారట

Read more RELATED
Recommended to you

Exit mobile version