బాలయ్య సినిమాలో కేథరీన్ థెరీసా ఔట్‌.. రీజ‌న్ ఏంటంటే..!

-

గ‌త ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు ఈ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. త‌ర్వాత రూలర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం కూడా బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ప్ర‌స్తుతం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమా ప్రారంభమైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే.

గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ మూవీలో కేథరీన్ థెరీసా నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం కేథరీన్ థెరీసా ఈ సినిమాలో నటించట్లేదట. కేథరిన్ రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసింద‌ట‌.

దీంతో మేకర్స్ ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. కాగా, బాలయ్య మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు బోయపాటి. 2020 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ఇక ఈ సినిమా పిబ్రవరి మూడో వారం నుండి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version