‘రివాల్వర్ రీటా’గా కీర్తిసురేశ్.. ఫస్ట్​లుక్ అదుర్స్

-

మహానటి కీర్తిసురేశ్ గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతోంది. మహానటి తర్వాత ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్​పై ఫోకస్ చేసింది. అవి కూడా నిరాశపరచడంతో సర్కారు వారి పాటలో కాస్త గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం చంద్రు డైరెక్షన్​లో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్​టైనర్​లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది.

ఈ సినిమాకు రివాల్వర్‌ రీటా పేరును ఫిక్స్‌ చేస్తూ.. రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్‌ను పట్టుకుని ఉన్న కీర్తి పోస్టర్‌ను విడుదల చేశారు. పెయింటింగ్‌తో డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. మహిళ ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ది రూట్‌, ప్యాషన్‌ స్టూడీయోస్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version