ప్రధానికి సవాల్ విసిరిన కేజ్రీవాల్..ఆప్ ఎమ్మెల్యేలు,మంత్రులను జైల్లో వేయండి అంటూ..

-

ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడి అధికారులు అరెస్టు చేసి విచారిస్తుండడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా ఒక్కొక్కర్ని అరెస్టు చేయడం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయాలంటూ.. భారతీయ జనతా పార్టీకి ఆయన సవాల్ విసిరారు.

గురువారం ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..” ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నాదొక విజ్ఞప్తి. ఒక్కొక్కరిని ఎందుకు జైలుకు పంపిస్తున్నారు? ఇలా చేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయండి. ఏమేం కేసులు పెట్టాలని అనుకుంటున్నారో అన్ని కేసులు ఒకేసారి పెట్టేయండి. అలాగే ఇప్పుడు ఉన్న కేంద్ర ఏజెన్సీల అన్నింటినీ పిలిచి విచారణ చేపట్టండి. ఆ తర్వాతే మేము మా పని చేసుకుంటాము” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version