కేరళలో కొండపై చిక్కుకున్న యువకుడిని రెస్క్యూ చేసిన ఆర్మీ.. సినిమాని తలపించేలా ఘటన

-

స్నేహితులతో ట్రెక్కింగ్ వెళ్లిన ఓ యువకుడు కొండపైనే చిక్కుకుని రెండు రోజులుగా సహాయం కోసం ఎదురుచూసిన ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా ఆ యువకుడిని రెస్య్కూ చేసి కాపాడింది ఇండియన్ ఆర్మీ. కేరళోని పాలక్కాడ్ జిల్లాలోని మలంపుజా పర్వతాలతో ఏటవాలు లోయలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు నిన్న రాత్రి నుంచి ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. తాజాగా ఈరోజు ఉదయం కొండ చీలికలో చిక్కుకున్న బాబు అనే యువకుడిని ఆర్మీ సురక్షితంగా రెస్య్యూ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన హాలీవుడ్ మూవీ ‘127 అవర్స్’ని తలపించేలా ఉంది. రెండు రోజుల క్రితం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లాడు బాబు అనే యువకుడు. అయితే ఇద్దరు కొండ మధ్యలోనే డ్రాప్ కాగా.. బాబు కొండ శిఖరానికి చేరుకున్నాడు. అయితే అక్కడ నుంచి జారీ ఓ కొండ చీలికలో చిక్కుకుపోయాడు. దాదాపు రెండు రోజుల నుంచి సహాయం కోసం నిరీక్షిస్తున్నాడు. అయితే ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఆర్మీ సహాయాన్ని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ…బాబును సురక్షితంగా రక్షించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version