కరోనా పేషంట్ల కోసం నైట్రిక్ ఆక్సయిడ్ స్ప్రే ని లాంచ్ చేసిన గ్లెన్మార్క్..!!

-

కరోనా మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పటికే బూస్టర్ డోస్ ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇప్పుడు గ్లెన్మార్క్ ఫార్మ సూటికల్స్ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ని తీసుకు రావడం జరిగింది. ఫ్యాబి స్ప్రే అనే బ్రాండ్ పేరుతో బుధవారం దీన్ని లాంచ్ చేశారు.

గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మరియు కెనడియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ శానిటైజర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రే ని కరోనా మహమ్మారి తో బాధ పడుతున్న పెద్ద వాళ్ల కోసం తీసుకు రావడం జరిగింది. ఇండియాస్ డ్రగ్ రెగ్యులేటర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మాన్యుఫాక్చరింగ్ మార్కెటింగ్ అప్రూవల్ పొందింది.

ఇది ఇలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో 71,365 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 53,61,099 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య అయితే 8,92,828 కు చేరింది. దేశంలో తాజాగా 1,217 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,05,279 కి చేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version