నోటా విడుదల ఆపాలంటున్నారు..!

-

విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక గొడవ ఉండాల్సిందే. అర్జున్ రెడ్డి మూతి ముద్దుల గొడవ.. గీతా గోవిందం సినిమాకు లీకుల హంగామా.. ఇక లేటెస్ట్ నోటాకు రాజాకీయాల రచ్చ.. ఇలా ప్రతి సినిమా రిలీజ్ కు ముందు విజయ్ కు ఈ హెడేక్ మాత్రం తప్పట్లేదు. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న నోటా సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.

ఈ సినిమాను తెలంగాణాలో రిలీజ్ ఆపాలంటూ వివాదం రేపుతున్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణాలో ఎన్నికల హడావిడి మొదలైంది.. ఇలాంటి టైంలో నోటా సినిమా రావడం అంత శ్రేయస్కరం కాదని అంటున్నారు జగదీశ్వర్ రెడ్డి. నోటా అనే విషయాన్ని చిన్నదిగా చేసే చూపించే ప్రయత్నం ఉంటుందని. అందుకే ఎన్నికల కమీషన్ ఈ సినిమా చూసి అప్పుడు విడుదలకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు కేతిరెడ్డి.

శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళంలో విజయ్ తెరంగేట్రం చేస్తున్న సినిమాగా నోటా ప్రత్యేకత తెచ్చుకుంది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సాం సిఎస్ మ్యూజిక్ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version