విజేత కౌశల్.. వాట్ నెక్స్ట్..?

-

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు సెకండ్ సీజన్ లో కోట్ల కొద్ది ఓట్లతో టైటిల్ గెలుచుకున్న కౌశల్ ఊహించని విధంగా కౌశల్ ఆర్మీ అంటూ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు. అసలేమాత్రం పరిచయం లేని వ్యక్తులు ఒక షో ద్వారా ఈ రేంజ్ ఫాలో అయ్యేలా చేసుకున్నాడంటే కౌశల్ మాములోడు కాదు.

బిగ్ బాస్ టైటిల్ రేసులో కూడా అతను చూపించిన పోరాట పటిమ అందరిని ఆకట్టుకుంది. కౌశల్ కు ఎన్ని ఓట్లు వచ్చాయో నాని చెబుతాడని అనుకున్నారు కాని ఇప్పటికే బయట కౌశల్ ఆర్మీ బీభత్సం బయట ఓ రేంజ్ లో ఉండగా అది చెబితే ఇంకా రెచ్చిపోతారని భావించి ఆ టాపిక్ లేవనెత్తలేదు. ఇక వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ 2 టైటిల్ అందుకోవడమే కాదు 50 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు కౌశల్.

గెలిచిన మొత్తాన్ని తన తల్లి జ్ఞాపకంగా క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లులకు విరాళంగా ఇస్తానని అన్నాడు. ఇది కూడా బాగుంది. హౌజ్ లో అందరితో నానా మాటలు పడిన కౌశల్ ఇంత కష్టపడి గెలిచిన మొత్తం ఇలా విరాళంగా ప్రకటించడం గొప్ప విషయం. అంతా బాగానే ఉంది కాని కౌశల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.

సీరియల్స్ లో ఏదో సగటు నటుడిగా కెరియర్ కొనసాగిస్తున్న కౌశల్ ఇప్పుడు ఓ స్టార్ అయ్యాడు. అతని ఫాలోయింగ్ చూస్తే సినిమా హీరోగా చేస్తే మంచి క్రేజ్ వచ్చేలా ఉంది. ఇప్పటికే కొందరు దర్శకులు కౌశల్ హీరోగా సినిమా చేసేందుకు సై అంటున్నారట. సో బిగ్ బాస్ సీజన్ 1 ఎవరికి అంత ఉపయోగపడలేదు కాని బిగ్ బాస్ 2 కౌశల్ తో పాటుగా మిగతా కొంతమంది ఇంటి సభ్యులకు తమ కెరియర్ లో మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version