ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..ఇకపై ఆధార్ మార్పులు సులభతరం

-

సామాన్యుడికి ఆధార్ చాలా కీలకం. ఆస్ప్రతుల నుంచి సంక్షేమ పథకాల వరకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటున్నారు.కానీ డేట్ ఆఫ్ బర్త్‌‌లో మార్పుల కోసం జనాలు పడే పాట్లు వర్ణాణాతీతం. ఓ వ్యక్తి పుట్టిన తేదీని మార్చాలంటే వ్యక్తి స్టడీ, బర్త్ సర్టిఫికెట్లు తప్పనిసరి. కానీ, నిరక్షరాస్యులకు అవన్నీ ఉండవు. దీంతో అలాంటి వారు ఆధార్‌ డేట్ ఆఫ్ బర్త్‌లో మార్పులు చేసుకునేందు అష్టకష్టాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రాథమిక సమాచారం. డేట్ ఆఫ్ బర్త్ మార్పు కోసం పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు అందించే సర్టిఫికెట్ల మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆ సర్టిఫికేట్లపై క్యూ‌ఆర్ కోడ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news