సోమవారం జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ..ఓటింగ్‌కు రాష్ట్రాల డిమాండ్.!

-

సోమవారం జిఎస్‌టి కౌన్సిల్ కీలక సమావేశం జరగనుంది..ఈ భేటీలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది..ఇప్పటికే జీఎస్‌టి పరిహార బకాయిలు కేంద్రం చెల్లించడానికి బదులుగా రాష్ట్రాలు స్వంతంగా రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది..అయితే కేంద్రం ప్రతిపాధనను చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి..రాష్ట్రాల జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి..ఈ ప్రతిపాదనకు ప్రతిపాధనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది..దీంతో రాష్ట్రాల ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించాని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం జిఎస్‌టి కౌన్సిల్‌కు రాష్ట్రాల రుణ ప్రణాళికను ఆమోదించే అధికార పరిధి లేదని, రాష్ట్రాలకు సంబంధించిన రుణాలపై రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దీనిని రాష్ట్రాలు, ఆర్ధిక సంస్థల మధ్య మాత్రమే నిర్ణయించాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరో వైపు రాష్ట్రాలు జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై ఓటు కోరుకుంటే అక్కడ పెద్దగా ఫలితం ఉండకపోవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి..కోవిడ్ -19 మహమ్మారి వల్ల కేంద్రం మరియు రాష్ట్రాల తమ ఆదాయం కోల్పోయాయి..ఫలితంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నిధులను తగ్గించాయి. రాష్ట్రాలు తమ ఆర్ధిక లోటును పూడ్చాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి..రాష్ట్రాల లోటును కేంద్రమే భరించాలన్న ఈ ప్రతిపాదనకు జిఎస్‌టి కౌన్సిల్‌కు ప్రతిపక్ష పాలక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏకగ్రీవ మద్దతు లభించలేదు. దాదాపు 21 రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాధనకు సానుకూలంగా ఉన్నాయి..కాబట్టి, ఒక వేళ ఓటింగ్‌ నిర్వహిస్తే కేంద్రం ప్రతిపాధన గెలిచే అవకాశం ఉంది.

జీఎస్టీ పరిహారం సమస్య పరిష్కారమయ్యే విధంగా రుణాలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ద్రవ్య సంస్థలు,రాష్ట్రాలతో చర్చలు ప్రారంభించింది..జీఎస్టీ పరిహారాన్ని పరిష్కరించడానికి అన్ని రాష్ట్రాలు రుణాలు తీసుకునే అవకాశాలను అంగీకరించకపోయినా, మహమ్మారి నేపథ్యంలో ఈ సంవత్సరం రాష్ట్రాల అవసరాలకు నష్టం జరగకుండా ఉండటానికి ఈ ప్రణాళికను రూపొందిస్తుంది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version