ఏపీలోని చిత్తూరులో జరిగిన కాల్పుల ఘటనలో కీలక అప్డేట్ వచ్చింది. గాంధీరోడ్డులోని పుష్ప కిడ్ షాపింగ్ సెంటర్లోకి ఆరుగురు దొంగలు చొరబడినట్లు తెలుస్తోంది. అయితే, దొంగల దాడి నుంచి తప్పించుకునేందుకు షాపు యాజమాని గోడ దూకగా.. స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
అనంతరం బయటకు చేరుకున్న అతను లోపలికి చొరబడిన దొంగలను షట్టర్ వేసి బయటకు రానీయకుండా బంధించినట్లు తెలిసింది.సినీ ఫక్కీ తరహాలో స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకుని పోలీసులు బయటకు తీసుకువచ్చారు.దీనికి ముందు లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని ఓ ఇంట్లోకి దూరిన దొంగలు రెండు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపారు.అయితే, సదరు వ్యక్తి ఇంటి నిండా రక్తపు మరకలు కనిపించాయి.యజమాని అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను అదుపులోకి తీసున్నారు.రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరులో కాల్పుల కలకలం
లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని ఓ ఇంట్లోకి దూరిన దొంగలు
రెండు తుపాకులతో గాలిలోకి కాల్పులు
యజమాని అప్రమత్తతో పోలీసులకు సమాచారం
సంఘటనా స్థలానికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం pic.twitter.com/oHpP80h3BU
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025