కేజీఎఫ్ 2: అందరికీ నచ్చిన ఆ సీనే ఇబ్బందులు పెడుతుంది..

-

కేజీఎఫ్ 2 టీజర్ రిలీజై సంచలనం సృష్టిస్తున్న వేళ, ఒకానొక వివాదం చిత్రబృందాన్ని ఇబ్బంది పెడుతుంది. టీజర్ రిలీజైన కొద్ది సేపట్లోనే మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న కేజీఎఫ్ 2 కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ చివర్లో సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఐతే ఇప్పుడు అదే చిత్రబృందానికి సమస్యలు తెచ్చి పెడుతుంది. ఈ టీజర్ లో హీరో సిగరెట్ తాగడంపై కర్ణాటక ఆరోగ్య కేంద్రం అటు దర్శకుడికి, ఇటు హీరోకి నోటీసులు జారీ చేసింది.

సాధారణంగా సిగరెట్ విజువల్స్ వచ్చేటపుడు చట్టబద్దమైన హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ కేజీఎఫ్ 2 టీజర్ లో అది కనిపించలేదు. అందువల్ల కేజీఎఫ్ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఇప్పటివరకు హీరో యష్ కానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరి వీళ్ళెప్పుడు రియాక్ట్ అవుతారో చూడాలి. హాంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version