దొంగ నోట్ల దెబ్బకు… అక్కడ డబ్బులు అంటేనే భయపడుతున్న జనం…!

-

దొంగ నోట్లు” ఆర్ధిక వ్యవస్థను నిలువునా కూల్చేసేవి… కొందరు కాసుల కక్కుర్తి కోసం అమాయుకులను మోసం చేస్తూ దొంగ నోట్లను మారుస్తూ ఉంటారు. కోట్లకు కోట్లను మార్కెట్ లో ప్రవేశ పెడుతూ ఉంటారు. వందల కోట్లను మారుస్తూ పైకి అమాయకంగా తిరుగుతూ ఉంటారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇదే జరుగుతుంది. వందల కోట్లను అక్రమంగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. నెల రోజుల నుంచి పోలీసుల సోదాల్లో వంద కోట్ల రూపాయలు ఒక్క సత్తుపల్లిలోనే దొరికాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు…

సత్తుపల్లికి సమీపంలో ఉండే మర్లపాడు గ్రామంలో ఒక ఇంట్లో పది లక్షలు దొరికాయి. అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. సత్తుపల్లికి సమీపంలో ఉండే రాజీవ్ నగర్ కాలనీలో ఒక్కసారే 40 లక్షలను ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నారు. మరో అయుదు రోజుల్లో సిద్దారం అనే గ్రామంలో ఒక వ్యక్తి ఇంటి నుంచి 60 కోట్లను ఒకేసారి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఒకరి వద్ద 7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో ఖమ్మం జిల్లా పోలీసులు పక్కా స్కెచ్ వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

రాజీవ్ నగర్ కాలనీలో 20 ఇళ్ళు సహా మొత్తం సత్తుపల్లి ప్రాంతంలో 50 ఇళ్ళను అద్దెకు తీసుకుని దొంగ నోట్లను మారుస్తున్నారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. అక్కడ ఎక్కువగా ఉండే గిరిజనులు డబ్బులు తీసుకోవాలి అంటేనే భయపడిపోతున్నారు. 500, 2000 నోటు అంటేనే వణికిపోతున్నారు. ఎక్కడ ఏ దొంగ నోటు తమ జేబులోకి వస్తుందో అని పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు మాత్రమే డబ్బులు తీసుకుంటున్నారు. ఇంకా పోలీసుల సోదాల్లో అక్కడ డబ్బు బయటపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారీగా బాధితులు కూడా ఉన్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version