ఖమ్మంలో టీఆర్ఎస్ వర్గపోరు చల్లారినట్టేనా !

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు. పాత..కొత్త నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ,కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం సమన్వయంతో పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలో గ్రూప్ తగాదాలు ఇకనైనా కొలిక్కి వస్తాయా అన్న చర్చ ఇప్పుడు జిల్లా గులాబీ పార్టీ కార్యకర్తల్లో నడుస్తుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. అయితే టిఆర్ఎస్ పార్టీ కూడ ఓటర్లకు బారీగానే షాక్ ఇచ్చిందని ప్రచారం ఉంది. పది నియోజకవర్గాల్లో ఖమ్మం మాత్రమే టిఆర్ఎస్ గెలువగా, గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి పదవిని ఇచ్చింది. జిల్లాలో ఒక్కటి టిఆర్ఎస్, రెండు టిడిపి, ఆరు స్థానాల్లో కాంగ్రెస్ , మరో స్థానంలో కాంగ్రెస్ తిరుగుబాటు అబ్యర్ధులను గెలిపించి ప్రజలు షాక్ ఇచ్చారు. అయితే గెలిచిన ఇండిపెండెంట్ తో సహా గెలిచిన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోగా, టిడిపి నుంచి గెలిచిన సండ్ర కూడా టిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో టిఆర్ఎస్‌ బలపడింది.

ఇప్పుడు అశ్వరావుపేటలో టిడిపి, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంఎల్ఎలు ఉండగా.. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో గులాబి జెండా రెప రెప లాడుతోంది. జెండాలు ఎలాఎగురుతున్నాయో అదే స్థాయిలో వారిలో వర్గ విబేదాలు కూడ తారా స్థాయిలో పెరిగిపోయాయి.. గ్రూప్ తగాదాలు అధిష్టానంకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఈ సమావేశంలో కేటీఆర్ కొంత గట్టిగానే పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల తీరు దురుసుగా ఉందని కేటీఆర్ అన్నట్టు సమాచారం. ఇక..పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి అని కేవలం ఖమ్మానికే మంత్రి అనుకోవద్దని సమావేశంలో కేటీఆర్ ప్రస్తావించారని తెలుస్తోంది. ఐతే…సమావేశం కంటే ముందే మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్‌తో భేటి అయి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version