స్టాలిన్ కు మల్లికార్జున ఖర్గే ఫోన్

-

దేశంలో ప్ర‌తిప‌క్షాల‌ను ఏక‌తాటిపై తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ న‌డుం బిగించింది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ వ్య‌తిరేక ప‌క్షాల‌ను ఏకం చేసేందుకు సమాయ‌త్తం అవుతోంది. భావసారూప్యత కలిగిన పార్టీలతో సమావేశాన్ని నిర్వహించబోతోంది కాంగ్రెస్‌. ఈ మీటింగ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి, వచ్చే ఎన్నికలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు.

విపక్ష పార్టీల సమావేశానికి హాజరుకావాలని స్టాలిన్ ను ఖర్గే ఆహ్వానించారు. తాను సమావేశానికి హాజరవుతానని ఈ సందర్భంగా ఖర్గేకు స్టాలిన్ తెలిపారు. కాంగ్రెస్ కు డీఎంకే మిత్రపక్ష పార్టీ అనే విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉంది. మరోవైపు కాంగ్రెస్ నిర్వహించాలనుకుంటున్న మీటింగ్ కు ఇంకా సమయం, వేదికను నిర్ణయించలేదు. టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాల ప్రతిస్పందన కోసం కాంగ్రెస్ నేతలు వేచి చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version