ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్‌దే : ఖర్గే

-

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్‌దేనని, దాంతోనే నరేంద్రమోదీ, అమిత్‌షా వంటి వ్యక్తులు ప్రధాని, హోంమంత్రి పదవులను చేపట్టగలిగారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో గురించి మాట్లాడుతుంటే.. మోదీ భారత్‌ తోడో అని నమ్ముతున్నారన్నారు. మణిపూర్‌ హింసాత్మకంగా మారి మూడు నెలలవుతున్నా ప్రధాని పర్యటించలేని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని మోదీ చాలాసార్లు విమర్శించారన్నారు.

ఇకపోతే, తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ రేస్ మొదలైంది. టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య సమన్వయం చేసే పనిలో అబ్జర్వర్స్ ఉన్నారు. రేపటి నుంచి గాంధీ భవన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు. దీంతో పాటు ఎవరికి టికెట్ వచ్చినా తాము పని చేస్తామనే హామీ పత్రాన్ని కూడా తీసుకోనున్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేయనుంది. సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగనుంది. ఈ నెల 24న చేవెళ్లలో భారీ బహిరంగ సభను పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version