KHILADI : “ఖిలాడీ” మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ… యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శ కత్వంలో రూపొందిన ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరిచారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే.. ఎన్నో అంచలన మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ అయింది. అయితే ఎంతో అట్టహాసంగా విడుదలైన కిలాడి సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. క్రాక్ సినిమా తర్వాత రావడంతో అందరూ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

అయితే కథాంశం జనాల్లోకి ఎక్కక పోవడంతో డిజాస్టర్ గా మిగిలింది కిలాడీ. ఇది ఇలా ఉండగా తాజాగా కిలాడి సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. మార్చి 11వ తేదీన కిలాడి మూవీ డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. విడుదలైన నెలరోజులకే ఓటీటీలో కిలాడీ మూవీ రిలీజ్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version