తెలంగాణ లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం ?

-

సూర్యాపేటలో ఐదేళ్ళ బాలుడి మిస్సింగ్ సుఖాంతం అయింది. బాలుడి కిడ్నాప్ కు కుటుంబ సభ్యులతో పరిచయమున్న వ్యక్తియే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. కిడ్నాపర్ ఇంటి వెనుక ఉన్న మహిళా టైలర్ కు ఫోన్ సమాచారం అందించడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్టు అయ్యింది. రూ.7 లక్షలు డిమాండ్ చేయడంతో కిడ్నాపర్లకు బాలుడి తండ్రితో ఆ డబ్బు పంపారు పోలీసులు. ప్రధాన నిందితుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి మరో ముగ్గురి సహాకారంతో కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇప్పటికే పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు, బాలుడు, తండ్రిని వెంటబెట్టుకొని గుంటూరులో మరొకరి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత బాలుడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. అయితే ఆ బాలుడి తల్లి మాత్రం తన కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది.  అయితే పోలీసులు తల్లికి తెలియకుండా ఎందుకు ఉంచారు అనేది ఆసక్తికరంగా మారింది. 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version