కిమ్ బ్రతికే ఉన్నాడు, ఉత్తరకొరియా మీడియా…!

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి ఏంటీ…? ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా పనులు మానుకుని ఎదురు చూస్తున్న అంశం ఇది. ఆయన మరణించారు అని కొన్ని దేశాలు అదేం లేదని మరికొన్ని దేశాలు, ఆయన ఉండే ఉంటారు గాని దాక్కుని ఉండవచ్చు అని మరికొన్ని దేశాలు, ఆయన ఆరోగ్యం గురించి ఎన్నో విధాలుగా ఎన్నో కథనాలు అంతర్జాతీయ మీడియాలో పది రోజుల నుంచి వచ్చాయి.

ఈ తరుణంలో ఉత్తరకొరియా అధికారిక మీడియా కీలక ప్రకటన చేసింది. ఆ దేశ అధికారిక మీడియాలో ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారని కథనం వచ్చింది. ఒక ఎరువుల దుకాణం ని కిమ్ ప్రారంభించారని ఆ సందర్భంగా ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. అక్కడ ఆయన్ను చూసిన వారు చాలా మంది షాక్ అయ్యారని కూడా అక్కడి మీడియా చెప్పింది.

ఇది నిజమో కాదో తెలియదు గాని దక్షిణ కొరియా మాత్రం బాబు బ్రతికే ఉన్నాడని అలాంటిది ఏమీ లేదని చెప్తుంది. ఇప్పుడు ఈ వార్తను కూడా ఆ దేశం సమర్ధించింది. కిమ్ కి చాలా వ్యూహాలు ఉంటాయని అతనికి ఏదైనా ప్రమాదం ఉందీ అనుకుంటే ఎవరికి కనపడకుండా పోవడమే గాని చనిపోయే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. ఏది ఎలా ఉన్నా నెల రోజుల నుంచి నెలకొన్న ఉత్కంటకు తెరపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version