ఎప్పుడూ వివాదాస్పద శిక్షలు, నిర్ణయాలతో ప్రపంచంలోనే సంచలన కలిగిస్తుంటాడు ఉత్తర కోరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన ఏం చేసినా.. సంచలనమే, ప్రపంచ వార్త అవుతుంది. ఉత్తర కొరియాలో కిమ్ కు ఎదురులేదు. తను ఏది చెబితే… ఏది చేస్తే అదే రాజ్యాంగం. గతంలో తన సమావేశంలో నిద్రపోతున్న ఓ అధికారిని ఏకంగా మరణి శిక్ష విధించాడు. అధికారం కోసం సొంత సోదరుడిని చంపేశాడు. తనకు అనుమానం వస్తే సొంత మామను కూడా వదలేని చరిత్ర కిమ్ ది. మరోవైపు వరస క్షిపణులతో ప్రపంచానికి సవాల్ విసురుతున్నాడు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాను సవాల్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే మరో సంచలన నిర్ణయంతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు కిమ్. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి నిర్మించిన ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలిలను నియమించాడు. అయితే వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు. దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3 నెలలు, మరొకరికి 6 నెలల జైలు శిక్ష విధించారు.