విశాఖ షీలా నగర్లో నిర్మించిన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచానికి వైద్యాన్ని పరిచయం చేసిన ఘనత మన దేశానికే దక్కింది. వైద్య చికిత్సల కోసం విదేశీయులు సైతం భారత్ కు రావడం ఎంతో గర్వంగా ఉంటోందని ఆయన అన్నారు. వైద్య వృత్తి ఎంతో బాధ్యత, ప్రాధాన్యత గలది. కులమతాలకు అతీతంగా అందరూ చేతులెత్తి నమష్కరించేది ఒక్క వైద్యుడికే అని ఆయన అన్నారు. వీలైనంత వరకు తక్కువ ధరలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ వైద్యులు పనిచేసి రైతులు, నిరుపేదలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.