ముందస్తుకు సిద్ధంగా ఉండండి..కేసీఆర్

-

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు.. ముందస్తు ఎన్నికలు రావడం తథ్యమని దీంతో పార్టీ కేడర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.  ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే నిర్ణయాన్నిమాత్రం తనకు వదిలేయాలని కోరారు. హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.  ప్రగతి నివేదన సభ వేదికగా పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సభకు 25లక్షల మంది హాజరవుతారు. గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పనిచేయాలని.. చాలా వరకు సిట్టింగ్ స్థానాలను వారికే కేటాయిస్తామని కొన్నిచోట్ల కాస్త మార్పులు ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల పనితీరుని వారికి వివరించినట్లు సమాచారం. ప్రతిపక్షాల వ్యూహాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెరాస అధినేత కేసీఆర్ వెళ్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version