ఉప ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాస్త స్పీడ్ పెంచింది. బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు అందరూ కూడా కాస్త ఎక్కువగానే కష్టపడ్డారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ విషయంలో బీజేపీ లోకి కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు కొంత మంది ఆయన విషయంలో సీరియస్ గా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన విషయంలో సీరియస్ గానే ఉన్నారు.
కిషన్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారు. అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ఆయన క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో కూడా ఆయన వద్ద నుంచి బీజేపీకి పూర్తిస్థాయిలో న్యాయం జరిగింది. గతంలో పార్టీలో నాయకత్వ లోపం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కిషన్ రెడ్డి కాస్త ఎక్కువగా కష్టపడ్డారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆయన ప్రాధాన్యత కాస్త తగ్గిందనే భావన ఉంది. కేంద్ర మంత్రి గా ఉండటమే గాని కిషన్ రెడ్డి పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయనకు సహకారం లేదు. దీంతో అసలు ఆయన ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది అర్థం కాకపోయినా బండి సంజయ్ వల్ల మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో విజయం తర్వాత బండి సంజయ్ కాస్త ఆయనను దూరం పెడుతున్నారు అనే భావన ఆయనలో ఎక్కువగా ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.