కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పలపాలు అయ్యింది : కిషన్‌ రెడ్డి

-

పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుండ్లోరిగూడెంలో రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. ఒక్క ఎన్నికలప్పుడు తప్ప మామూలు సందర్భాల్లో కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకి రారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పలపాలు అయ్యిందని చెప్పారు కిషన్ రెడ్డి.

అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రోడ్లు, జీపీ భవనాలు, ఇండ్లు, ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. మునుగోడు నియోజవర్గంలో మొత్తం ఎన్ని గ్రామాల్లో రోడ్లు, జీపీ భవనాలు నిర్మించారో సీఎం చెప్పాలని నిలదీశారు కిషన్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలు రోడ్డు అడుగుతున్నారంటే సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు కిషన్ రెడ్డి. విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version