అమరావతిలో బుద్దవనం మ్యూజియాన్ని కేంద్ర సహాయక మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజా, సోము వీర్రాజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం ఇస్తున్నారని తెలిపారు.
కేవలం పుణ్య క్షేత్రాల సందర్శన కాకుండా కుటుంబం మొత్తం అమరావతి లో పర్యటించే విధంగా పర్యాటకం గా అభివృద్ధి చేస్తామన్నారు. వాటర్ స్పోర్ట్స్ టూరిజం ,టెంపుల్ టూరిజం తో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వివరించారు. ప్రపంచ దేశాలు నుండి రాయల సీమ లో ఉన్న తిరుమల దర్శనానికి భక్తులు వస్తున్నారు… రాయల సీమలో హార్సిలీ హిల్స్,తలకోన వంటి పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి రోజా.