ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జనసేన తో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొనే అంశం మీద తెలంగాణ బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జనసేన తో తమకు ఎలాంటి పొత్తు లేదని డి.కె.అరుణ అలాగే మరికొందరు నేతలు వ్యాఖ్యానించడంతో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కు పవన్ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ హైకమాండ్ జాగ్రత్త పడింది.
బీజేపీ జనసేన బంధం మెరుగుపర్చుకునేందుకు గాను కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని రంగంలోకి దిగినట్లు సమాచారం అందుతోంది. ఆయన త్వరలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మరోపక్క తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఆయన పాదయాత్ర షెడ్యూల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించి తెలంగాణలో కూడా ప్రచారానికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందుకు పవన్ ఎంత మేరకు సంపాదిస్తాడు అనేది చూడాలి మరి.