ఈ రోజు ఐపీఎల్ సీజన్ 2022లో జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి తలపడబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ (4/14) తన స్పిన్ మాయాజాలంతో కోల్‌కతాను దెబ్బ కొట్టినప్పటికీ.. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్ (3/18) ఆఖరి ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి (నితీశ్, రింకూ సింగ్ (23), సౌథీ (0)) కేకేఆర్‌ను ఓ మోస్తరు స్కోర్ కూడా చేయకుండా కట్టడి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, అక్షర్ పటేల్ తలో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓసారి తలపడ్డాయి. ఇది రెండో మ్యాచ్ కావడ విశేషం. అయితే గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించి కేకేఆర్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి నేడు కేకేఆర్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.