ముంబై ఇండియన్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్.. జట్ల బలాబలాలు ఇవే !

-

ఐపీఎల్-14 వ సీజన్‌లో ఇవాళ ముంబై ఇండియన్స్ – కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ముంబై  ఓడిపోగా, మొదటి విజయంతో జోరు మీద ఉంది నైట్ రైడర్స్ టీం. అయితే ఇప్పటి వరకు కోల్‌కత్తాపై, ముంబై జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వచ్చింది. రెండు టీంల మధ్య 21 మ్యాచ్‌ల జరిగితే కోల్‌కత్తా కేవలం 7 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.  ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడగా.. అందులో కేకేఆర్ విజయం సాధిస్తే ముంబై మాత్రం పరాజయం పాలైంది. దాంతో ఈ రెండు మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. మొదటి మ్యాచ్ కు అందుబాటులో లేని ముంబై జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ పైన బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో రాణించిన కేకేఆర్ ముంబై ను ఆపగలదా ? అంటే అనుమానమే. కోల్కతా జట్టులో ఉన్న హిట్టర్ రస్సెల్ మరియు స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ కూడా ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు కలవర పెట్టే అంశమే. చూడాలి మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

కేకేఆర్ జట్టు అంచనా: నితీష్ రానా, శుబ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (డబ్ల్యు కె), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, ప్రసీద్ కృష్ణ, హర్భజన్ సింగ్ మరియు వరుణ్ చక్రవర్తి

ముంబై ఇండియన్స్ అంచనా : రోహిత్ శర్మ (సి), క్వింటన్ డికాక్ (డబ్ల్యు కె), సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, మార్కో జాన్సెన్, ట్రెంట్ బౌల్ట్ మరియు జస్‌ప్రీత్ బుమ్రా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version