వాస్తవం ఏంటో తెలుసుకొని రాయండి.. ఫైర్ అవుతున్న దిల్ రాజు..!!

-

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన ఎన్నో సినిమాలను తన బ్యానర్ ద్వారా నిర్మించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కార్తికేయ టు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ఈ సినిమా విడుదల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు మీడియాపై మండిపడ్డారు. ఇకపోతే కార్తికేయ 2 సక్సెస్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన దిల్ రాజు మాట్లాడుతూ.. మీడియా వారు అడిగితే వారికి సమయం ఇస్తాను.. నిజా నిజాలు తెలుసుకొని రాయండి.. మీ వ్యూస్, క్లిక్ , సబ్స్క్రైబర్ల కోసం ఏది పడితే అది రాసి నా పేరును పాడు చేయవద్దు.. మీరు తొక్కితే తొక్కించుకునే అంత చేతకాని వారెవరు లేరు ఇక్కడ.. అసలు ఏం తెలుసుకోకుండానే మీడియా రాద్ధాంతం మొదలుపెట్టింది.

నిజానికి నేను ఎవరితో కూడా గొడవలు పెట్టుకోను. కార్తికేయ 2 వదంతే నన్ను చాలా అప్సెట్ చేసింది. మీడియా నన్ను బలి పశువును చేసింది. ఒకపక్క ఐదు సినిమాలు ఆడుతున్నా.. కార్తికేయ 2 నైజాంలో రూ.4 కోట్లు వసూలు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థ.. వారిని తొక్కేంత దమ్ము టాలీవుడ్ లో ఎవరికి ఉంది? నిజాలు తెలుసుకోవాలి.. రాసే వారికైనా, వినే వారికైనా, చదివే వారికైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక హ్యాపీడేస్, యువత చిత్రాల ద్వారా నిఖిల్ నాకు బాగా క్లోజ్ అయ్యారు. నాకు మంచి స్నేహితుడు కాబట్టే ఇలా సక్సెస్ మీట్ కి పిలిచాడు.. సినిమా రిలీజ్ ను రెండుసార్లు వాయిదా వేసే ముందు అందర్నీ సంప్రదించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారే తప్ప ఇందులో నా తప్పిదం ఏమీ లేదు.. అసలు ఇందులో నేను జోక్యం చేసుకోలేదు అంటూ వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version