పులిని పెళ్లి చేసుకుంటా.. కన్నడ అసెంబ్లీలో రచ్చ రేపిన ఎమ్మెల్యే !

-

కర్ణాటక కొడగు జిల్లాలో ఒక పులి నలుగురిని చంపిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో నిన్న అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ చర్చలో సభ్యుల నుండి వింత ప్రకటనలు వచ్చాయి. బిజెపికి చెందిన విరాజ్‌పేట ఎమ్మెల్యే కెజి బోపయ్య మాట్లాడుతూ “మొదట ఆ పులిని పట్టుకోండి. మీరు పట్టుకోలేకపోతే, మాకు తెలియజేయండి. మేము అవసరమైన చర్యలు తీసుకుంటాము. మేము పులిని వివాహం చేసుకుంటాము ” అని అన్నారు.

అంటే ఆ ఎమ్మెల్యే ‘నారి మంగళ’ అనే పాత సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, ఈ కామెంట్స్ చేశారు. ఈ ప్రాంతంలో పులి వేటగాడు తాను చంపిన పులిని వివాహం చేసుకుంటాడు. ఈ కొడగులో పులి వేటగాళ్లు సాంప్రదాయకంగా గౌరవించబడతారు. బోపయ్యకు సపోర్ట్ గా మడికేరికి చెందిన ఎమ్మెల్యే అప్పచు రంజన్ మాట్లాడుతూ “ఇది ఇప్పటికే నలుగురిని చంపింది. మీరు పట్టుకోలేకపోతే మేము ఆ పులిని చంపుతాము ”. అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version