తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ దరిద్రంలా పట్టారని.. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు మంత్రి కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. పార్టీ అధికారంలోకి రావడానికి మరోసారి ఎన్టీఆర్ కి, రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి బయటకు గెంటెసి, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందికి దించారని.. మళ్లీ వెన్నుపోటు పొడవాలని 420 బ్యాచ్ చూస్తుందని ఆరోపించారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు కొడాలి నాని.
ఎన్టీఆర్ శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుంది-మంత్రి కొడాలి నాని
-