రాజధానిని వైజాగ్‌కు తీసుకుని వెళ్ళటం ఖాయం – కొడాలి నాని

-

పరిపాలనా రాజధానిని వైజాగ్‌కు తీసుకుని వెళ్ళటం ఖాయమని తేల్చి చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు రాజధానులకు మా పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయటమే మా లక్ష్యమని… కర్నూలులో న్యాయ రాజధాని రావటం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ సంకల్పాన్ని అడ్డుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరని.. రాజధాని బిల్లును ప్రస్తుతం ప్రభుత్వం ఉపసంసరించుకుందని తెలిపారు.

మరిప్పుడు వీళ్ళు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు?? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కృష్ణా జిల్లా శాసనసభ్యుడిగా నేను స్వాగతిస్తున్నానన్నారు. అమరావతి పై ఒక పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించి… జగన్ పై విమర్శలు చేస్తున్నాడని.. హైదరాబాద్ ను నిర్మించటం ప్రారంభించింది నేనే అన్నాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత హైదరాబాద్‌ను నిర్మించటం ప్రారంభించాడట అంటూ చురకలు అంటించారు. దాన్ని రాజశేఖరరెడ్డి కొనసాగించారట.. చంద్రబాబు వేసిన గ్రాఫిక్స్‌ను జగన్ కొనసాగించాలా?? అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్ట వచ్చు అనుకుంటున్నాడన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version