ఆంధ్రప్రదేశ్ శాసన సభలో, మండలి తీరుపై పెద్ద చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్న బ్లాక్ డే కాదు ఎల్లో డే అని మంత్రులు ఆరోపించారు. కన్నా బాబు మాట్లాడుతూ వికేంద్రీకరణ అనేది రాష్ట్రానికి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. విచక్షణాదికారాలు చైర్మన్ కే కాదు సభా నాయకుడికి కూడా ఉంటాయని అన్నారు.
మండలికి బిల్లులను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసారు. అదే విధంగా కొడాలి నానీ మాట్లాడుతూ లోకేష్ రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ అన్నారు. మండలిని పునరుద్దరించి లోకేష్ కి భిక్ష పెట్టారని అన్నారు. మండలిని ఉంచాలో తీసెయ్యాలో ఆలోచించాలి అన్నారు. యనమల పేరు ఎత్తితే ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ గుర్తుకి వస్తుంది అన్నారు. మండలిలో మంచి వాళ్ళు ఉన్నారని బిల్లులను అడ్డుకోలేమని వాళ్ళు చెప్పారని అన్నారు.
పెద్దల సభ అంటే బరువు ఉన్న సభ కాదని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, జగన్ దెబ్బకు వెళ్లి గ్యాలరి ఎక్కి కూర్చున్నారని ఎద్దేవా చేసారు. అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మరో మంత్రి మోపిదేవి మాట్లాడుతూ… చట్టాలను రాజకీయ కోణాలతో చూడటం, తిరస్కరించడం బాధాకరం. మన రాష్ట్రానికి మండలి అవసరం లేదని అన్నారు.
నేను మండలి సభ్యుడిని అయి ఉండి ఈ విషయం చెప్తున్నా అన్నారు. పెద్దల సభను తెలుగుదేశం ఆఫీస్ లా మార్చేశారని, గ్యాలరీలో ఉన్న చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్ పని చేసారని అన్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని అన్నారు. రూల్ 71 పై చర్చ అంటూ ఒక రోజు అంతా సమయం వృధా చేసారని, పెద్దల సభను తెలుగుదేశం ఆఫీస్ లా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు.