టీడీపీని జూ.ఎన్టీఆర్‌కు అప్పగించండి : కొడాలి నాని సంచలన ప్రకటన

-

టీడీపీని జూ.ఎన్టీఆర్‌కు అప్పగించండని కొడాలి నాని సంచలన ప్రకటన చేశాడు. ” జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అని ఏపీ ప్రజలు.. నిన్న నారా లోకేష్‌ ను అడిగారు.

అయితే, దానికి నారా లోకేష్‌ సమాధానం ఇస్తూ, నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం.. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో.. ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి.. ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలని ఆశిస్తారో? వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి..” అంటూ తారక్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే, దీనిపై కొడాలి నాని స్పందించారు.

జూనియర్ ఎన్టీఆర్కు టిడిపి పగ్గాలు అప్పగించి చంద్రబాబు మరియు నారా లోకేష్ పార్టీ నుంచి తప్పుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ న్యూ నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించడం ఏంటని మండిపడ్డారు. అది ఆయన తాతస్థాపించిన పార్టీ అని గుర్తు చేశారు కొడాలి నాని. మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదని…తెలుగుదేశం పార్టీలో రావాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డినీ ఓడించే దమ్ము లేక జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అడుగుతున్నారని చేశారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version