వంగవీటి రాధా రెక్కీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. జాగ్రత్తగా ఉండాలి !

-

వంగవీటి రాధా రెక్కీ ఎపిసోడ్ పై మొదటి సారి మంత్రి కొడాలి నాని స్పందించారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకేనని.. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు కొడాలి నాని. తనను హత్య చేయటానికి రెక్కీ జరిగిందని రాధా నా సమీక్షంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని.. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే విచారణ చేయాలని చేయాలని, భద్రత కల్పించాలని ఆదేశించారని వెల్లడించారు.

భద్రత కల్పించాలని రాధా నన్ను అడగలేదు, నేనూ సీఎంను అడగలేదని.. గన్ మ్యాన్ లను తీసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని రాధాకు సూచించానని పేర్కొన్నారు. భద్రత తీసుకోవాలా వద్దా, పోలీసులకు సహకరించాలా వద్దా అన్నది రాధా వ్యక్తిగత విషయం అని చెప్పారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. విచారణ జరుగుతున్న సమయంలో బాధ్యత గల మంత్రిగా నేను చంద్రబాబులా నోటికి వచ్చినట్లు మాట్లాడలేనని పేర్కొన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version