కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి – కోదండరాం

-

కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు కోదండరాం. కవిత అరెస్ట్ ను తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని… కవిత అరెస్ట్ తెలంగాణ ప్రజల సమస్య కాదని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలతో సతమతమవుతున్నారు… కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం ఇది అధికార మదం… అహంకారం అని మండిపడ్డారు. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు పాలుపడిన కవిత.. మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానడం సిగ్గు చేటు అన్నారు.

సారాయి వ్యాపారంతో కవితకు ఏమీ పని అని… కవిత, అదానీ విషయంలో ఓకే విధానంతో ఉన్నామని వెల్లడించారు. సొంత వ్యాపారుల కోసం అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారు… కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఆగ్రహించారు. రేపు మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నాం… తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఈ సదస్సుకు తరలి రావాలని పిలుపు అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు కోదండరాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version