తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారు : కోదండరాం

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ స్పీచ్‌పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో ఎనిమిదేళ్ల విధ్వంసాన్ని అద్భుతమని చూపించే ప్రయత్నం చేశారని కోదండరాం విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పురోగతి చెందిందని చెప్పడం బాధాకరమన్నారు కోదండరాం. తమిళిసై స్పీచ్ లో కాళేశ్వరం పూర్తైందని పెద్ద అబద్ధం చెప్పారని కోదండరా వాపోయారు. ప్రభుత్వం రాసి ఇచ్చిందే గవర్నర్ చదివారన్నారు.

గవర్నర్ కి ఇచ్చిన ప్రతిలో అన్ని అబద్ధాలు, తప్పులు ఉన్నాయని ఆరోపించారు. గవర్నర్ చెప్పినట్లు ప్రాజెక్టు పూర్తైతే 16లక్షల ఎకరాలకు సాగు నీరు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు కోదండరాం. గోదావరి, కృష్ణా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు ప్రజలకు మేలు చేయకపోగా.. కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి చేకూర్చిందని అన్నారు. ప్లోరైడ్ పీడ వదిలిందన్న తమిళిసై మాటలు అవాస్తవమని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటా పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్న కోదండరాం.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు కోదండరాం .

 

Read more RELATED
Recommended to you

Exit mobile version