ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకి వచ్చేసింది. ఈ సారి ఐపీఎల్ సీజన్లో ఒక్కో టీమ్ లో ఒక్కో ఆటగాడు అద్భుతమైన ప్రదర్శనని కనబరిచారు. అలా కనబర్చిన వాళ్ళలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు ఛాలెంజర్స్ కెప్టెన్ కోహ్లీ, పంజాబ్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో కే ఎల్ రాహుల్ 670పరుగులతో అద్భుతమైన ఆటతో అందరినీ మరిపించాడు. కోహ్లీ కూడా 460పరుగులు చేసారు.
ఐతే ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ బ్రాడ్ హాగ్ తయారు చేసిన ఐపీఎల్ టీమ్ లో లేకపోవడం గమనార్హం. మాజీ క్రికెటర్ బ్రాడ్ తనకి నచ్చిన ఐపీఎల్ టీమ్ ని తయారు చేసాడు. అందులో ఓపెనర్లుగా శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ని చేర్చాడు. మూడవ స్థానంలో సూర్య కుమార్ యాదవ్, నాలుగవ స్థానంలో ఏబీ డివిలియర్స్, తర్వాత కోల్ కతాకి చెందిన ఇయాన్ మోర్గాన్, ఆరవ స్థానంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.. ఏడవ స్థానంలో 20వికెట్లు తీసుకున్న జోఫ్రా ఆర్చర్, ఎనిమిదిలో సన్ రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్, తొమ్మిది మహమ్మద్ షమి, పది జస్ప్రిత్ బుమ్రా, చివరగా బెంగళూరు స్పిన్నర్ చాహల్ ని తీసుకున్నాడు.