IPL 2021 : బ్యాటింగ్ లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్.. నైట్ రైడర్స్ టార్గెట్ 128

-

ఇవాళ సార్జా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో, ఢిల్లీ కాపీటల్స్ జట్టు తల పడుతున్న సంగతి తెలిసిందే. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు… ఆది నుంచి తడబడింది. 20 ఓవర్లలో ఏకంగా 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఓపెనర్లు స్టీవ్ స్మిత్ 39 పరుగులు, శిఖర్ ధావన్ 24 పరుగులు మరియు కెప్టెన్ రిషబ్ పంత్ 39 పరుగులు చేసి దిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆదుకున్నారు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లు పూర్తిగా విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్ 1, హెట్మెయర్ 4 పరుగులు, లలిత యాదవ్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగారు. దీంతో డిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక అటు కోల్ కత్తా నైట్రైడర్స్ జట్టు బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారు. ఫెర్గూసన్ రెండు వికెట్లు, సునీల్ నరైన్ రెండు వికెట్లు మరియు వెంకటేష్ అయ్యర్ రెండు వికెట్లు తీసి ఢిల్లీ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో నైట్ రైడర్స్ జట్టు గెలవాలంటే 20 ఓవర్లలో 128 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే నైట్ రైడర్స్ చేంజింగ్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version