సొంత ఇలాకాలో కోమటి రెడ్డి కి చేదు అనుభవం..!

-

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సొంత ఇలాక అయిన నల్లగొండలో చేదు అనుభవం ఎదురయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏ పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం ముస్లిం నేతలు మంత్రి ని నిలదీశారు.

మంత్రి ని కదలకుండా అడ్డుకునే వాగ్వాదానికి దిగారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంఐఎం నేతల పై సీరియస్ అయ్యారు. ముస్లిం నేతలు మంత్రి పై కోపంతో కోమటిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని ఎంఐఎం నేతని అక్కడినుండి పోలీసు వాహనంలో స్టేషన్ కి తరలించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version