పీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించాల్సిందే – ఎంపీ కోమటిరెడ్డి

-

ఢిల్లీ నుండి నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ ఏ ఎలక్షన్ లో జరిగినా పాల్గొన్నాను… 35 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడ్డానని వివరించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ ఉద్యమానికి ఆమరణ నిరాహార దీక్షకు చేసి… ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెగించి కొట్లాడానని వెల్లడించారు.

నా లాంటి కార్యకర్తలకు న్యాయం జరగలేదు.. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం బాగుపడుతుందని ప్రశ్నించారు. హుజురాబాద్ లాగా మూడు వేలు, నాలుగు వేలు ఓట్లు తెచ్చుకుంటారు.. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని… తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు.

అలాగే.. కాంగ్రెస్‌ అధిష్టానం ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొత్త డిమాండ్‌ పెట్టారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని మార్చాలని డిమాండ్‌ చేశారు. కమల్‌నాథ్‌ లాంటి ఇంఛార్జ్‌ను వేయాలి, రేవంత్‌ కొనసాగితే పార్టీ చచ్చిపోతుంది, అంది అభిప్రాయాలు తీసుకుని కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు ఎంపీ కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version