RRR నుంచి మరో అప్‌డేట్..‘కొమురం భీముడో’ సాంగ్ వీడియో వచ్చేస్తోంది..ఎప్పుడంటే?

-

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రికార్డు వసూళ్లు చేసిన ఈ పిక్చర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ నటించారు. వీరిరువురి నటన చూసి జనం ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో తారక్ కంటే రామ్ చరణ్ పాత్రకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని కొందరు ఆరోపించారు. కానీ, అందులో నిజం లేదని దర్శకుడు రాజమౌళి కొట్టి పారేశారు. మరో వైపున సినీ అభిమానులు ‘కొమురం భీముడో’ సాంగ్ వీడియో లో తారక్ ఎక్స్ ప్రెషన్స్ తోనే తన నట విశ్వ రూపం చూపారని అంటున్నారు.

మూడు నిమిషాల పాటతోనే తాను సినిమా నిడివి మూడు గంటల పాటు నటనలో పోటీ ఇవ్వగలనని తారక్ చెప్పకనే చెప్పేశారని వివరిస్తున్నారు సినీ లవర్స్. సినిమా స్టోరిలో అంతటి ప్రాముఖ్యత కలిగిన పాటను తన నటనతో ఇంకా హైలైట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ‘కొమురం భీముడో’ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఈ నెల 6 న సాయంత్రం 4 గంటలకు సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ పిక్చర్ కు స్టోరి విజయేంద్రప్రసాద్ అందించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్, తారక్ సరసన హీరోయిన్ గా హాలీవుడ్ భామ ఒలివియా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version