నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు చేసిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన రాకేష్ అనే ఆర్మీ అభ్యర్థి మరణించాడు. అయితే నేడు వరంగల్‌లో రాకేష్ అంతిమయాత్ర ర్యాలీ నిర్వహించారు. అయితే రాకేష్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్తుండగా ఆయను ఘట్‌కేసర్ దగ్గర అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలంటూ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ మాట్లాడుతూ.. . ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి చేష్టలే నన్ను మంత్రిని చేశాయని, ఇప్పుడు కేసీఆర్ చేష్టలు. కాంగ్రెస్ నీ అధికారంలోకి తెస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేయాలని, వచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కోసం ఉద్యమం చేయాలా..? అని ఆమె మండిపడ్డారు.
మేము ఇచ్చిన తెలంగాణను సెట్ చేస్ బాధ్యత మాదే అన్న సురేఖ.. మమల్ని అడ్డుకునే ప్రయత్నం ఎంత చేస్తే..అంతా ఎక్కువ ఆందోళనల చేస్తామన్నారు. కొండా సినిమాని ఎర్రబెల్లి అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆమె ఆరోపించారు. రేవంత్ రాకుండా అడ్డుకుంటున్నారని, రేవంత్ వస్తే ఎర్రబెల్లి బండారం బయట పెడతారు అని భయం అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి నీ తిట్టాలంటే వరంగల్‌కే రావాలా..? హైదరాబాద్ లో ఉండి తిట్టడకూడదా ..?అంటూ ఆమె వ్యాఖ్యానించారు.